Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయం100 కోట్ల మందిలో మానసిక రుగ్మతలు

100 కోట్ల మందిలో మానసిక రుగ్మతలు

- Advertisement -

ప్రతి ఏడుగురిలో ఒకరికి ఈ సమస్య
ప్రాణ నష్టంతోపాటు ఆర్థికంగా అపార నష్టం : డబ్ల్యూహెచ్‌ఓ
జెనీవా :
ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకుపైగా ప్రజలు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని, ప్రతి ఏడుగురులో ఒకరికి ఈ సమస్య ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. వీరిలో ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడుతున్నవారి సంఖ్యే ఎక్కువని పేర్కొంది. యువతలో మరణాలకు ఆత్మహత్య ప్రధాన సమస్యగా కనిపిస్తోందని తెలిపింది. మొత్తంగా ఈ మానసిక సమస్యలు ప్రాణ నష్టంతోపాటు ఆర్థికంగా అపార నష్టాన్ని కలిగిస్తున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ అంచనా వేసింది.’వరల్డ్‌ మెంటల్‌ హెల్త్‌ టుడే’, ‘మెంటల్‌ హెల్త్‌ అట్లాస్‌ 2024’ పేరుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తాజా నివేదిక విడుదల చేసింది. గ్లోబల్‌ హెల్త్‌ ఎస్టిమేట్స్‌ 2021 డేటాబేస్‌ విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందించింది. యువతలో మరణాలకు ఆత్మహత్య ప్రధాన కారణంగా కనిపిస్తోందని, ప్రతి వంద మరణాల్లో ఒకటి ఆత్మహత్యగా ఉంటోందని పేర్కొంది. 20 ప్రయత్నాల అనంతరం ఈ బలవన్మరణాలకు పాల్పడుతున్నట్టు గుర్తించింది.
ప్రతి 200 మందిలో ఒకరికి స్కిజోఫ్రెనియా, ప్రతి 150 మందిలో ఒకరు బైపోలార్‌ డిజార్డర్‌తో బాధపడుతుండటం ఆందోళనకర కలిగించే విషయమని తాజా నివేదిక వెల్లడించింది. మానసిక రుగ్మతల వల్ల కలిగే నష్టాలను ఇందులో అంచనా వేసినట్టు డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. వీటి కారణంగా ప్రాణనష్టమే కాకుండా ఆర్థికంగానూ తీవ్ర పరిణామాలు ఉంటున్నాయని తెలిపింది. ఉత్పాదకత కోల్పోవడం వల్ల పరోక్షంగా సమాజానికీ నష్టమేనని పేర్కొంది. ఈ నేపథ్యంలో మానసిక, ప్రజారోగ్య పరిరక్షణపై ప్రభుత్వాలు తక్షణమే దృష్టి సారించి, వాటికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రెయేసస్‌ సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad