Friday, January 9, 2026
E-PAPER

100% వినోదం

- Advertisement -

రవితేజ, డింపుల్‌ హయతి, ఆషిక రంగనాథ్‌ నాయకానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమా ఈనెల 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను మేకర్స్‌ లాంచ్‌ చేశారు. ఈ ఈవెంట్‌లో హీరో రవితేజ మాట్లాడుతూ,’ ‘ఈసారి పండక్కి సరదా సరదాగా గోల చేద్దాం. ఇదొక్కటే కాదు.. వస్తున్న అన్ని సినిమాలు ఫుల్‌ ఎంటర్టైమెంట్‌. ఈసారి ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంక్రాంతి అవుతుందని నా ప్రగాఢ నమ్మకం’ అని తెలిపారు. ‘ఇది అద్భుతమైన జర్నీ. పాటలు, టీజర్‌కి సూపర్‌ రెస్పాన్స్‌ ఇచ్చారు. సినిమా అద్భుతంగా ఉంటుంది. ఈనెల 13న సినిమా రిలీజ్‌ అవుతుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ చూడాలని కోరుకుంటున్నాను’ అని ఆషిక రంగనాథ్‌ చెప్పారు.

డింపుల్‌ హయాతి మాట్లాడుతూ,’ రవితేజతో ఇది నాకు రెండో సినిమా. ఇది నా మొదటి సంక్రాంతి సినిమా. అందరూ థియేటర్స్‌లో సినిమా చూడాలని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ‘ఇది అవుట్‌ అండ్‌ అవుట్‌ ఫ్యామిలీ ఫన్‌ ఫిల్మ్‌. ఖచ్చితంగా అందరూ ఎంజాయ్‌ చేస్తారు. సంక్రాంతికి రిలీజ్‌ అవుతున్న అన్ని సినిమాలు సూపర్‌ హిట్‌ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని డైరెక్టర్‌ కిషోర్‌ తిరుమల చెప్పారు. నిర్మాత సుధాకర్‌ చెరుకూరి మాట్లాడుతూ,’మంచి ఎంటర్టైన్మెంట్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. ఈ సంక్రాంతికి మా సినిమా సరదా సందడిని తెస్తుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, ఎడిటర్‌: శ్రీకర్‌ ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఏఎస్‌ ప్రకాష్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: విజయ్‌ కుమార్‌ చాగంటి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -