నవతెలంగాణ – నెల్లికుదురు
నిరక్షరాస్యతను నిర్మూలించి 100% అక్షరాస్యతను సాధించినప్పుడే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతుందని మండల విద్యాశాఖ అధికారి ఏ రాందాస్ అన్నారు. మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వివో ఏ విలేజ్ రిసోర్స్ పర్సన్ లకు మండల స్థాయి ఒక్కరోజు ఉల్లాస్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెల్లికుదురు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు గీతతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో 100% అక్షరాస్యతను సాధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని దీనిలో భాగంగానే గ్రామాల్లో నిరక్షరాశులను గుర్తించి పది మంది నిరక్షరాస్యులకు ఒక టీం లీడర్ ను నియమించిందని తెలిపారు.
గ్రామంలోని సంబంధిత టీం లీడర్లకు మండల స్థాయిలో శిక్షణ పొందిన వివో ఏలు విలేజ్ రిసోర్స్ పర్సన్ లు గ్రామస్థాయిలో వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు నిరక్షరాస్యత నిర్మూలనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులై సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలని తెలిపారు అనంతరం మండల రిసోర్స్ పర్సన్ లు వివో ఏ లకు ఆర్పీలకు శిక్షణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామ పంచాయతీల పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులు మండల రిసోర్స్ పర్సన్ లు ఎస్ చంద్రశేఖర్ లక్ష్మీనారాయణ మండల ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్ మస్కపురి సుధాకర్ కంప్యూటర్ ఆపరేటర్ హెచ్ ఉపేందర్ సి ఆర్ పి లు ఏ భాస్కరరావు బి వీరస్వామి బి కవిత జె కవిత తదితరులు పాల్గొన్నారు.
వంద శాతం అక్షరాస్యతను సాధించాలి: ఎంఈఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES