డీఎంఈ ఆఫీస్‌లో బైటాయింపు : తెలంగాణ యూనైటెడ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
104 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ యూనైటెడ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షులు భూపాల్ డిమాండ్ చేశారు. బుధవారం యూనియన్ ఆధ్వర్యంలో డీఎంఈకి వినతి పత్రాన్ని ఇచ్చేందుకు వెళ్లిన ఉద్యోగులను, యూనియన్ నేతలను కలిసేందుకు నిరాకరించటంతో కార్యాలయంలో ఎంప్లాయీస్ బైటాయించారు దీంతో పోలీస్‌లకు కంప్లైంట్ ఇచ్చి బెదిరించారు. అయినా కదలకపోవడంతో వెంటనే డీఎంఈ సంబధిత అధికారులను కలవాలని చెప్పారు. పెండింగ్ సమస్యలు, స్వంత జిల్లాలా సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు సానుకూలంగా స్పందించారు. లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నవీన్ కుమార్, 104 ఉద్యోగులు సుభాష్, ఆదిల్, పురుషోత్తం, శ్రీనివాస్, రేవతి, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు
104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



