2వ రోజుకు చేరిన నిరసన
పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
104 ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ఐదు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నా బుధవారం రెండవ రోజుకు చేరుకుంది. ఒకవైపు వర్షం పడుతున్న లెక్కచేయకుండా వర్షంలోనే నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా 104 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మామిడి వెంకన్న మాట్లాడుతూ.. గత 17 సంవత్సరాలుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న 104 ఉద్యోగులకు కనీసం వేతనాలు లేకుండా విధులకు హాజరవుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. 5 నెలల వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదని అలాగే ఉద్యోగాల కంటిన్యూషన్ పై కూడా స్పష్టత ఇవ్వకపోవడం వల్ల, ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అనేక మార్లు ఉన్నత అధికారులను కలిసి విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో, నిరసన తెలపాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, 104 ఉద్యోగులు సురేందర్, ప్రశాంత్, నాగనాథ్, సుభాష్, వీర కేశవ్, పద్మ, సంధ్య, ఇక్బాల్, ఇబ్రహీం ఉన్నారు.