ప్రభుత్వానికి టీజీసీటీఏ ధన్యవాదాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న 104 మంది అధ్యాపకులు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందారు. డిగ్రీ కళాశాలల్లో 14 ఏండ్ల బోధన సేవలను, పరిశోధనా అనుభవాన్ని గుర్తించి ఇచ్చే అసోసియేట్ ప్రొఫెసర్ల పదోన్నతకి అన్ని సబ్జెక్టుల్లో 104 మందిని ఎంపిక చేశారు. వీరిలో మల్టీ జోన్ 1 నుంచి 50 మంది, మల్టీ జోన్ 2 నుంచి 54 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో పదోన్నతల కల్పన పట్ల తెలంగాణ గవర్న మెంట్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ (టీజీసీటీఏ) అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఇ.బ్రిజేష్, చైర్‌పర్సన్ డాక్టర్ సౌందర్య జోసెఫ్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సకాలంలో పదోన్నతి కల్పించిన సీఎం రేవంత్‌రెడ్డికి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా, కళాశాల విద్యా కమిషనర్ శ్రీదేవసేన, జాయింట్ డైరెక్టర్లు ప్రొఫెసర్ డి.ఎస్.ఆర్.రాజేంద్ర సింగ్, ప్రొఫెసర్ పి.బాలభాస్కర్, అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ ప్రొఫెసర్ వి.రాజేంద్రప్రసాద్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు. పదోన్నతుల విషయంలో భాగస్వాములైన అధికారులకు, బోధనేతర సిబ్బందికీ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది.
104 మంది అధ్యాపకులకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



