Wednesday, November 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం106 మంది ఇరిగేషన్‌ ఇంజినీర్లపై బదిలీ వేటు

106 మంది ఇరిగేషన్‌ ఇంజినీర్లపై బదిలీ వేటు

- Advertisement -

ఎన్‌వోసీల జారీలో అవకతవకలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
నీటిపారుదల శాఖలో ఇంజినీర్లను భారీగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మంగళవారం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్‌వోసీల జారీ విషయంలో ఇంజినీర్లపై వచ్చిన ఆరోపణల ఆధారంగా ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది. బదిలీ అయిన 106 మంది ఇంజినీర్లల్లో ఈఈలు, డీఈఈలు, ఏఈఈలు ఉన్నారు. గతంలో వచ్చిన ఆరోపణలతోపాటు క్షేత్రస్థాయిలో ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు రావడంతో సమూల ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం క్షేత్రస్థాయి ఇంజినీర్లను బదిలీ చేసింది. హైదరాబాద్‌ సర్కిల్‌ పరిధిలోనే 60 మందికిపైగా ఇంజినీర్లపై బదిలీ వేటు వేయడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -