మండల ప్రజలకు సేవాలందించాలి.
108 జిల్లా మేనేజర్ మెరుగు నరేశ్ యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు.
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ప్రజలకు సేవలందించడానికి ప్రభుత్వం వేర్పాటు చెసిన 108 అంబులెన్స్ వాహనాన్ని గురువారం 108 జిల్లా మేనేజర్ మెరుగు నరేశ్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా అంబులెన్స్ లో మెడిసిన్స్,మెడికల్ ఎక్విప్మెంట్స్,రికార్డ్స్ తదితర వాటిపై వెరిఫై చేసి,వర్కింగ్ కండిషన్ తనిఖీ చేయడం జరిగిందన్నారు.గత మూడు నెలల పనితీరుపై సిబ్బందితో చర్చించినట్లుగా తెలిపారు.సిబ్బందిఎప్పటికప్పుడు మెడిసిన్స్ అప్డేట్ చేసుకుంటూ అందుబాటులో ఉంచుకొని,కాల్ రాగానే తొందరగా బయలుదేరాలని ఆదేశించారు.మండల ప్రజలకు అందుబాటులో ఉండాలని, సిబ్బందికి సూచనలు చేశారు.ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ భాస్కర్,పైలెట్ సంపత్ పాల్గొన్నారు.
108 అంబులెన్స్ వాహనం తనిఖీ.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES