శిశు మరణాల రేటును తగ్గించడమే లక్ష్యం….
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
అప్పుడే పుట్టిన నవజాత శిశువులు తల్లి గర్భంలో నుండి పుట్టగానే ఏదో ఒక లోపంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. బరువు తక్కువ పుట్టడం శ్వాస సరిగా తీసుకోలేకపోవడం ఉమ్మనీరు మింగడం బిడ్డ అడ్డం తిరిగి పుట్టడం ఎటువంటి సందర్భాలలో మనం వింటూనే ఉంటామన్నారు. అలాంటి ఆపత్కాలంలో మనకు గుర్తు వచ్చేది ఒక్కటే 108 అత్యవసర సేవలు అత్యవసరంగా మెరుగైన సేవలతో 108 లో మినీ ఐసీను తలపించే అత్యాధునికమైన పరికరాలతో శిశువులకు సేవలు అందించడం చాలా గర్వంగా ఉన్నది ప్రస్తుతం ఉన్న రోజుల్లో శిశు మరణాల రేటును తగ్గించే ముఖ్య ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది.
అందులో భాగంగా 108 నియోనెటల్అంబులెన్స్ లో ఇంకుబేటర్ అనే పరికరం ద్వారా ఆసుపత్రుల నుంచి హైదరాబాద్ నీలోఫర్ గాంధీ కి తీసుకువెళ్లే సమయంలో శిశువును ఇంక్యుబేటర్ లో పెట్టడం వలన తల్లి యొక్క గర్భంలో ఉన్నట్టుగానే ఉంటుంది ప్రత్యేకత ఏంటి అంటే అప్పుడే పుట్టిన శిశువులకు వెచ్చదనంతో మరియు ఆక్సిజన్ అందించడానికి చాలా అత్యధికమైన టెక్నాలజీతో కూడుకున్నది కావున శిష్యులను తరలించేటప్పుడు ఈ సేవలను వినియోగించడం ఆనందించిన వలసిన విషయం దీనివలన సరైన సమయానికి సరైన విధంగా చికిత్స అందించడం వలన ఎంతో మంది శిశువులకు ఆసరాగా ఉంటుంది మన జిల్లా యాదాద్రి జిల్లాలో బోనగిరి జిల్లా 108 నియోనేటల్ సేవలు అద్భుతంగా అందిస్తున్నాయనారు.
ప్రజల నుంచి కూడా శిశువుల ప్రయోజనాల కొరకు ఇటువంటి అంబులెన్స్ కేటాయించడం అనేది చాలా సంతృప్తికరం కూడా వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా అత్యవసర సమయంలో శిశువులను తరలించడానికి వెంటిలేటర్ ఐ వి ఫ్లూడిస్ ద్రావణాలను అందించడానికి కూడా ప్రత్యేకియమైన పరికరాలతో కూడుకొని ఉంటుంది కావున ప్రజలందరూ కూడా 108 సేవలను వినియోగించుకోవాలని ఈ ఎం ఆర్ ఐ గ్రీన్ హెల్త్ సర్వీస్ అధికారులు ప్రోగ్రాం మేనేజర్ షేక్ సలీం, యాదాద్రి జిల్లా 108 ఇంచార్జ్ మహేష్ కుమార్ తెలియజేశారు యాదాద్రి జిల్లా ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ ప్రోగ్రాం మేనేజర్ షేక్ సలీం.
వీలైనంతవరకు నవజాత శిశువులకు అత్యధిక అవసరాలతో సేవలందించే ముఖ్య లక్షణంగానే ఎంతోమంది శిష్యుల ప్రాణాలను కాపాడటం మా ముందున్న ముఖ్య లక్షణం కావున ప్రజలందరూ ఈ యొక్క సేవలను వినియోగించుకోవాలని కొనియాడారు.