Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శిశువుకు కృత్రిమ శ్వాస అందించిన 108 సిబ్బంది..

శిశువుకు కృత్రిమ శ్వాస అందించిన 108 సిబ్బంది..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
నవజాత శిశువు జన్మించగానే ఏడవకపోవడంతో 108 సిబ్బంది కృత్రిమ శ్వాసను అందించి బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. వివరాలను పరిశీలిస్తే.. నవజాత శిశువు జన్మించగానే ఏడవకపోవడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న శిశువుకు ప్రథమ చికిత్సను అందించి బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్ కి తరలించాల్సిందిగా డాక్టర్లు సూచించారు. అక్కడ నుండి హాస్పిటలకు తరలిస్తున్నప్పుడు 108 సిబ్బంది ఆ యొక్క శిశువుకు బ్యాగ్ మాస్క్ ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తూ ప్రథమ చికిత్స ఇచ్చి బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. 

శిశువు యొక్క ఆరోగ్యం బాగానే ఉందని 108 సిబ్బంది తెలిపారు. అనేక సమస్యల కారణాలతో నవజాత శిశువులు ఏదో ఒక లోపంతో పుట్టడం పుట్టగానే సరైన శ్వాస తీసుకోకపోతే ఉమ్మనీరు త్రాగడము ఇటువంటి ఎన్నో సందర్భాలలో నీయనేటల్ అంబులెన్స్ సేవలు సేవలను అందించడం అమోఘం.

భువనగిరి జిల్లా ఆస్పత్రి నుండి హైదరాబాద్ నిలోఫర్ హాస్పిటల్ లకు తరలించే సమయాలలో నేనిటల్ అంబులెన్స్ సేవలు పాత్ర కీలకం నవజాత శిశువులకు ప్రథమ చికిత్సను అందించడంలో 108 సిబ్బంది పాత్ర అద్భుతం సరైన సమయంలో శిశువులకు బ్యాగ్ మాస్క్ వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శాసన అందించడం వలన ఎంతోమంది శిశువుల యొక్క ప్రాణాలను కాపాడుతున్నందుకు జిల్లాలో అభినందనలు వెలువడుతున్నాయి






- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -