Monday, January 12, 2026
E-PAPER
Homeఖమ్మంప్రకృతి వ్యవసాయానికి జిల్లావ్యాప్తంగా 11 క్లస్టర్లు

ప్రకృతి వ్యవసాయానికి జిల్లావ్యాప్తంగా 11 క్లస్టర్లు

- Advertisement -

– ప్రతి క్లస్టర్‌లో 125 మంది రైతులు,30 మంది కృషి సఖి ల నియామకం
నవతెలంగాణ –  అశ్వారావుపేట

జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ అమలులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 9 వ తేదీన అశ్వారావుపేట లో నిర్వహించిన రైతు మేళాలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొత్తం 11 ప్రకృతి వ్యవసాయ క్లస్టర్ లను ఏర్పాటు చేసి, ఒక్కో క్లస్టర్‌లో 125 మంది రైతులను గుర్తించారు. పథకం సమర్థవంతంగా అమలు కావడానికి 30 మంది ‘కృషి సఖులు’ (కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు) ఎంపిక చేశారు. వీరికి జిల్లా కేంద్రం కొత్తగూడెంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి శిక్షణ ప్రారంభమైంది.

ప్రకృతి వ్యవసాయానికి కృషి సఖులే కేంద్రము
ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామస్థాయిలో విస్తరించడం లో కృషి సఖులు కీలక పాత్ర పోషించనున్నారు. వీరు రైతులకు మిత్రులుగా, మార్గదర్శకులుగా, స్థానిక సలహాదారులుగా పనిచేస్తారు.

కృషి సఖి ల ప్రధాన బాధ్యతలు:
శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, ప్రచార మాధ్యమాలతో అనుసంధానం
సాంకేతిక, యాంత్రిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేయడం
ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు రైతులకు అందేలా మార్గనిర్దేశం
సాగులో కొత్త ఆవిష్కరణలు, డెమోన్స్ట్రేషన్లు నిర్వహించడం
రైతుల సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలు చూపడం
ఐసీటీ ద్వారా ఆధునిక సేవలు
ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ  ద్వారా రైతులకు
మార్కెట్ సమాచారం
వాతావరణ అంచనాలు
పంట సలహాలు
ధరల వివరాలు
అందించే విధంగా కృషి సఖులు పనిచేస్తారు.
రైతుల ఆర్థిక భద్రతపై దృష్టి
కృషి సఖులు రైతులను
బ్యాంకులు, క్రెడిట్ లింకేజీలు
పంట బీమా
వాతావరణ ఆధారిత రిస్క్ మేనేజ్‌మెంట్
వంటి అంశాలకు అనుసంధానం చేసి రైతుల ఆర్థిక భద్రతను పెంపొందిస్తారు.
నేల, నీరు, పంటల సంరక్షణ
ప్రకృతి వ్యవసాయంలో భాగంగా
నేల ఆరోగ్య నిర్వహణ
నీటి సంరక్షణ
తెగుళ్ల నియంత్రణ
సేంద్రియ ఇన్‌పుట్ల వినియోగం
వంటి అంశాలపై రైతులకు నిరంతర మార్గదర్శకత్వం అందించనున్నారు.

మండలాల వారీగా ప్రకృతి వ్యవసాయ క్లస్టర్లు

మండలం                               క్లస్టర్లు

అశ్వారావుపేట                          2
పినపాక                                     1
కరకగూడెం                                1
అశ్వాపురం                                1
ఇల్లందు                                     1
టేకులపల్లి                                  1
సుజాతానగర్                             1
జూలూరుపాడు                          1
పాల్వంచ                                   1
చర్ల                                            3
దుమ్ముగూడెం                            1

ఈ విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకృతి వ్యవసాయానికి మోడల్ జిల్లాగా మారే దిశగా అడుగులు వేస్తోంది. రైతుల ఆదాయం పెరగడమే లక్ష్యంగా ప్రభుత్వం, కృషి సఖులు కలిసి ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకెళ్లనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -