– అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) మధుమోహన్
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం 25వ నంబర్ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) మధుమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వినతిపత్రాలను స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు. ప్రజల సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. శాఖల వారీగా వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన మొత్తం 114 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు స్పందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ చందర్, ఏఓ, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.


