Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుఆపరేషన్ ముస్కాన్ లో 115 మంది బాల కార్మికుల గుర్తింపు..

ఆపరేషన్ ముస్కాన్ లో 115 మంది బాల కార్మికుల గుర్తింపు..

- Advertisement -

ముస్కాన్ టీమ్ ఇన్చార్జ్, (డబ్ల్యూ) ఎస్సై అండాలు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

ఆపరేషన్ ముస్కాన్ XI లో భాగంగా రాచకొండ పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు ఆదేశానుసారం భువనగిరి డిసిపి  అక్షాంశ్ యాదవ్, ఎసిపి రాహుల్ రెడ్డి  సారధ్యంలో భువనగిరి డివిజన్ లో బాలకార్మికుల గుర్తింపు ఆపరేషన్ జరిపారు. ఇందులో భాగంగా టీం నెల రోజుల వరకు టీం సభ్యులగు మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి.అండాలు , హెడ్ కానిస్టేబుల్ ధర్మపురి శ్రీనివాసచారి,కానిస్టేబుల్స్ ఎం సురేష్, ఎం హరీష్, ఆర్ భవాని,బి సాయికుమార్,స్కోప్ ఎన్జీవో ఎన్ యాదయ్య టీం సభ్యులతో బోనగిరి, బీబీనగర్, బొమ్మలరామారం మండలాల్లో ఆపరేషన్ చేపట్టారు.

ఈ క్రమంలో 115 మంది బాల కార్మికులను రెస్క్యూ చేసి వారి తల్లిదండ్రులకు సిడబ్ల్యుసి  నందు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ పిల్లలతో పని చేయిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. భువనగిరి డివిజన్లో వ్యాపారస్తులకు పరిశ్రమ దారులకు అవగాహన సదస్సు నిర్వహించి “బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం వారి విద్య అభివృద్ధికి తోడ్పడుదాం” అనే నినాదంతో భువనగిరి డివిజన్ ముస్కాన్ టీం పనిచేసినట్టు తెలిపారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad