Monday, October 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విప్లవ వీరుడు భగత్ సింగ్ 118వ జయంతి

విప్లవ వీరుడు భగత్ సింగ్ 118వ జయంతి

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు, విప్లవ వీర యువకిశోరం భగత్ సింగ్ 118వ జయంతి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చింతల నాగరాజు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ధైర్యంగా ఎదిరించి, ఉరుకంబాన్ని ముద్దాడిన మహావీరుడు భగత్ సింగ్ అని అన్నారు. “ఇంకిలాబ్ జిందాబాద్” అని నినదించి యావత్ యువతలో చైతన్యాన్ని రగిలించిన దీపిక ఆయననే అని పేర్కొన్నారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని సమాజ మార్పు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు ఎస్. మల్లేష్, కేసుమల్ల సైదులు, శ్రీను, బంగారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -