- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి
జగదాంబ దేవి సేవాలాల్ మహారాజుల ఆలయం నిర్మించి నేటికీ 11 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా తాండ పెద్దలు, తాండవాసులు ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అలయంలోప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో మెంట్రాజ్ పల్లి సొసైటీ చైర్మన్ చింత శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ భోదునపు నవీన్, రఘు తండా పెద్దలు హరిలాల్, మీసాల హరి, హరిచంద్, నాయకులు సురేష్, కిషన్, పవన్, వసంత్, అశోక్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -