Thursday, July 31, 2025
E-PAPER
Homeకరీంనగర్డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 12 మందికి జరిమానా

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 12 మందికి జరిమానా

- Advertisement -

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడిన 12 మంది వ్యక్తులకు హుజురాబాద్ గౌరవ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ 15 వేల చొప్పున జరిమానా విధించినట్లు,ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా తమ వాహన ధ్రువపత్రాలను (డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ బుక్, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్) కలిగి ఉండాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -