– నేడు హైదరాబాద్ శిల్పకళావేదికలో టీచర్స్‌డే
– ముఖ్యఅతిథిగా హాజరు కానున్న సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఈ ఏడాది రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2025కు 120 మంది టీచర్లని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు 49 మంది, జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు 11 మంది, డిగ్రీ కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకులు 56 మంది, సాంకేతిక విద్యాశాఖలో నలుగురు అధ్యాపకులు కలిపి మొత్తం 120 ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన వారికి గురుపూజోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవార్డులను ప్రదానం చేస్తారు. వారిని సన్మానించడంతోపాటు రూ.10 వేల నగదు, ప్రశంసాపత్రం, శాలువా, బంగారుపూత పూసిన రజత పతకాన్ని అందజేస్తారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలతోపాటు మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను కూడా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే.భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాష్ణన్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్‌బాబు అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా కేంద్ర మంత్రులు జి కిషన్‌రెడ్డి, బండి సంజరు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు ప్రత్యేక అతిథులుగా శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, రాష్ట్ర మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతోపాటు విశిష్ట అతిథిగా సీఎస్ కె రామకృష్ణారావు పాల్గొంటారు.
120 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES