– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఊరట
– రాష్ట్ర సర్కారు జీవో జారీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న 12055 మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యో గుల సర్వీసును రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు పొడిగిస్తు న్నట్టు ప్రకటించింది. ఈ పొడిగింపు 2026 మార్చి 31 వరకు వర్తించనున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1222ను విడుదల చేసింది. మూడు నెలలుగా సర్వీసు పొడిగింపు కోసం ఎదురుచూస్తున్న వారికి ఊరట లభించినట్టయింది. వారి సేవల పొడిగింపు జరగకపోవ డంతో సాంకేతిక కారణాలతో మూడు నెలలుగా జీతాలు నిలిచిపోయాయి. జీవో జారీతో వారి మూడు నెలల పెం డింగ్ వేతనాల విడుదల ప్రక్రియ పూర్తయింది. ఆర్థిక శాఖ నుంచి పంచాయతీరాజ్ శాఖకు నిధులు అందాయి. ఒకట్రెండు రోజుల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వేతనాలు వారి ఖాతాల్లో పడనున్నాయి.
12,055 మంది ఉద్యోగుల సర్వీసు ఏడాది పొడిగింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES