- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ఎదుట ఇవాళ భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు. 124 మంది పీఎల్‌జీఏ మావోయిస్టులు, దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ కానున్నట్టు సమాచారం. ఈరోజు సాయంత్రం 4 గంటలకు బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయుధాలతో సహా మావోయిస్టులు లొంగిపోనున్నారు. ఈ సందర్భంగా మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటుపై సీఎం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
- Advertisement -



