Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీపీ ముందు 13 మంది బైండోవర్ 

సీపీ ముందు 13 మంది బైండోవర్ 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
జిల్లా అదనపు మెజిస్ట్రేట్, పోలీస్ కమిషనర్ ముందు పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 13మంది శనివారం బైండోవర్ చేశారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం, మిలాద్-ఉల్-నబి, దుర్గామాత ఉత్సవం సందర్భంగా డీజే ఆపరేటర్లు, డీజే యజమానులు, ట్రబుల్ మాంగర్స్, బోధన్ డివిజన్ పరిధిలో గల వివిధ పోలీస్ స్టేషన్ల లలో గతంలో నమోదైన కేసుల లోని నిందితులను బైండోవర్ చేశారు. వచ్చే 6 నెలల పాటు సత్పవర్తనతో ఉండాలని డీజే యజమానులకు రూ.2 లక్షలు, ట్రబుల్ మాంగర్స్ కు రూ. లక్ష, డీజే ఆపరేటర్లకు రూ.50వేలు స్వంత పూచీకత్తు పై బైండోవర్ చేశారు. పై పూచీకత్తు కాలంలో మళ్ళీ నేరాలు చేసినట్లు అయితే పూచీకత్తు ఇచ్చిన రూపాయలను జప్తు చేసి జైలు శిక్ష విధిస్తామని తెలిపారు. బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2, బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 05, ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 03, రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురిని బైండోవర్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -