Tuesday, May 13, 2025
Homeతెలంగాణ రౌండప్14న సామాజిక తనిఖీ ప్రజావేదిక ..

14న సామాజిక తనిఖీ ప్రజావేదిక ..

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి : ఈనెల 14న మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మండలంలోని 14 గ్రామాలలో ఏప్రిల్ 1, 2024 నుండి మార్చి 31, 2025 కాలములో జరిగిన పనులపై సామాజిక తగ్గి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 14వ తేదీన ఉదయం 9గంటలకు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఈ సామాజిక తనిఖీ  ప్రజావేదిక ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ ప్రజా వేదికలో షెడ్యూలు ప్రకారం గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి పనుల తనిఖీకి సంబంధించిన వివరాలు వెల్లడించడం జరుగుతుందని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజా వేదికకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -