Thursday, February 5, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు14 వార్డులు ఏకగ్రీవం

14 వార్డులు ఏకగ్రీవం

- Advertisement -

కాంగ్రెస్‌ ఖాతాలో 12, బీఆర్‌ఎస్‌కు 2
అత్యధికంగా కోదాడలో 3, వికారాబాద్‌లో 2
వివరాలు వెల్లడించిన ఎన్నికల సంఘం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మున్సిపల్‌ ఎన్నికల్లో 14 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 7 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 116 మున్సిపాల్టీల్లోని 2,996 వార్డులకు సంబంధించి నామినేషన్ల తుది వివరాలను ఎన్నికల సంఘం అధికారులు బుధవారం వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ ఏకగ్రీవంగా 12 వార్డులను కైవసం చేసుకోగా, రెండు వార్డుల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్లో ఒకటి, కోదాడలో మూడు వార్డులు, వికారాబాద్‌ మున్సిపాల్టీలో రెండు వార్డుల్లో ఏకగ్రీవ ఫలితాలొచ్చాయి. మహబూబ్‌ నగర్‌, రామగుండం కార్పొరేషన్లలో ఒకటి చొప్పున, యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు ఏకగ్రీవమయ్యాయి.

1).ఆలంపూర్‌, 10వవార్డు, పి. విక్రమ్‌ బీఆర్‌ఎస్‌
2).చౌటుప్పల్‌ ,17వవార్డు, చింతల ఉమామహేశ్వరి (కాంగ్రెస్‌)
3).ఎదులాపురం, 15వ వార్డు , తమ్మినేని మంగతాయి (కాంగ్రెస్‌)
4).హాలియా, 10వార్డు చంద్రకళ పిల్లి (కాంగ్రెస్‌)
5).హుజూర్‌ నగర్‌, 3వ వార్డు (బీసీ మహిళ) ఎస్‌. నాగలక్ష్మి (కాంగ్రెస్‌) ఏకగ్రీవం
6).కోదాడ, 11వ వార్డు దేవరపల్లి మల్లేశ్వరి (కాంగ్రెస్‌)
7).కోదాడ, 21వార్డు, కట్టెబోయిన జ్యోతి (కాంగ్రెస్‌)
8).కోదాడ, 31 వార్డు, యెర్నేని కుసుమ కుమారి (కాంగ్రెస్‌)
9).మహబూబ్‌ నగర్‌ కార్పొరేషన్‌, 58వ వార్డు, బి. రమాదేవి(కాంగ్రెస్‌)
10) మెదక్‌, 32వవార్డు, జి. మానస (కాంగ్రెస్‌)
11).రామగుండం కార్పొరేషన్‌, ఒకటోవార్డు, మడిపెల్లి విజయ (కాంగ్రెస్‌)
12).వికారాబాద్‌, ఒకటోవార్డు, అనంత్‌ రెడ్డి పటోల్ల (కాంగ్రెస్‌)
13).వికారాబాద్‌, 15వవార్డు, పి. విజయలక్ష్మి (బీఆర్‌ఎస్‌)
14).యాదగిరిగుట్ట, పదోవార్డు గుండ్లపల్లి వాణి (కాంగ్రెస్‌)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -