Wednesday, May 14, 2025
Homeరాష్ట్రీయంకల్తీ మద్యం కాటుకు 15 మంది మృతి

కల్తీ మద్యం కాటుకు 15 మంది మృతి

- Advertisement -

– పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో విషాదం
అమృతసర్‌:
పంజాబ్‌లోని అమృతసర్‌లో కల్తీ మద్యం కాటుకు 15 మంది ప్రాణాలు కోల్పో యారు. మరో ఆరుగురు ఆస్పత్రి పాలయ్యారు. జిల్లాలోని భంగాలీ, పటాల్‌పురి, మరారీ కలాన్‌, దేర్వాల్‌, తల్వాండి గుమాన్‌ గ్రామాల ప్రజలు కల్తీ మద్యం సేవించారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. పరిస్థితిని సమీక్షించేందుకు సీనియర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ ఆయా గ్రామాలకు చేరుకున్నారని అమృతసర్‌ డిప్యూటీ కమిషనర్‌ సాక్షి సానీ మంగళవారం తెలిపారు. కల్తీ మద్యం ఘటనపై భారతీయ న్యాయ సంహిత, ఎక్సైజ్‌ చట్టం కింద కేసు నమోదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -