Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పర్యాటక శాఖకు 15 మంది పోలీస్ అధికారుల కేటాయింపు..

పర్యాటక శాఖకు 15 మంది పోలీస్ అధికారుల కేటాయింపు..

- Advertisement -

కలెక్టర్ ను కలిసిన అధికారులు…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖకు (80) మంది పోలీస్ సిబ్బందిని అలాట్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు (15) మంది పోలీస్ ఆఫీసర్ ని కేటాయించగా.. జిల్లా యువజన మరియు టూరిజం అధికారి కే ధనంజనేయులుతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావురావును మర్యాద పూర్వకంగా కలిశారు. భువనగిరి కిల్లాకు నలుగురు అధికారులను కేటాయించారు.  సునీత , బి. రాజశేఖర్, ఎల్. మమతా, ఎ. దుర్గ యదాద్రి టెంపుల్ గుట్ట కు ఆరుగురు, కె మహేందర్ గౌడ్, కె నరేష్, సింగం. నవీన్, ఎన్ శ్రీనివాస్, కస్తూరి. శ్రీకాంత్, యెమ్.డి. హజ్మత్ లను కేటాయించారు. 

పోచంపల్లి రూరల్ (5): డి.సంతోష్, ఎన్.లావణ్య, జి.జాహ్నవి, సి.హెచ్. భవాని, తక్షణమే వీరికి అలా చేసిన డ్యూటీలలో నిమగ్నం కావాలని  సమయపాలన పాటించాలని  కోరారు. టూరిస్ట్ పోలీసుల విధులు  బాధ్యతలు కూడా తెలియజేసినారు. రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రదేశాలలో దేశీయ మరియు విదేశీ పర్యాటకులను సందర్శించే వారికి భద్రత కల్పించడం, రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించే విధంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను ప్రోత్సహించాలనీ,

రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలలో పర్యాటక ప్రచార కార్యకలాపాలు, పర్యాటకుల కు సరైన భద్రత, జిల్లాల్లో పర్యాటక ప్రదేశం యొక్క ప్రాముఖ్యత ను వివరించడం, నేరాలను అరికట్టడానికి మరియు సందర్శకుల భద్రతను, ముఖ్యంగా మహిళా పర్యాటకులను నిర్ధారించడానికి పర్యాటక ప్రదేశాలు,  చిహ్నాలు మరియు రవాణా కేంద్రాల వద్ద క్రమం తప్పకుండా గస్తీ & జనసమూహ నియంత్రణ, దారి తప్పిపోయిన, స్థానిక ఆచారాల గురించి తెలియని లేదా అత్యవసర సహాయం అవసరమైన పర్యాటకులకు సహాయం, సమాచారం అందించడం సందర్శకుల భద్రత, భద్రతను నిర్ధారించడం ద్వారా పర్యాటక గమ్యస్థానానికి సానుకూల బ్రాండ్ ఇమేజ్‌ను నిర్మించడంలో కీలక పాత్ర  పోషించాలని కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -