Thursday, July 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఛత్రపతి సాహు మహారాజ్ 151వ జయంతి 

ఛత్రపతి సాహు మహారాజ్ 151వ జయంతి 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్  : భీమ్ ఆర్మీ నిజామాబాద్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో చత్రపతి సాహు మహారాజ్ 151 వ జయంతి ఘనంగా గురువారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు మదలే అజయ్ రావణ్ మాట్లాడుతూ.. చత్రపతి సాహు మహారాజ్ 151 వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సందర్భంగా అంబేద్కర్‌తో చత్రపతి షావు మహారాజ్ కి ఉన్న అనుబంధం మార్చు కళాకారులు దత్తోబా పవార్, డిట్టోబా దాల్వీ ద్వారా సాహుమహారాజ్‌ను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు పరిచయం చేశారు. భీంరావు గొప్ప తెలివితేటలు, అంటరానితనం గురించి అతని విప్లవాత్మక ఆలోచనలు మహారాజును ఎంతగానో ఆకట్టుకున్నాయి. 1917-1921 సమయంలో ఇద్దరూ అనేక సార్లు కలుసుకున్నారు. కుల ఆధారిత రిజర్వేషన్ అందించడం ద్వారా కుల విభజన ప్రతికూలతలను తొలగించడానికి సాధ్యమైన మార్గాలను పరిశీలించారు. వారు 21- 1920 మార్చి 22 సమయంలో అంటరానివారి అభ్యున్నతి కోసం ఒక సమావేశాన్ని నిర్వహించారు. సమాజంలోని వేర్పాటు వర్గాల అభ్యున్నతికి కృషి చేసే నాయకుడు అంబేద్కర్ అని నమ్మినందున షాహూ అంబేద్కర్‌ను ఛైర్మన్‌గా చేశారు. అంతేకాకుండా రూ. 2,500, అంబేద్కర్ కు అందించారు. ప్రతి ఒక్కరూ చత్రపతి సాహు మహారాజ్ జీవిత చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ నిజామాబాద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -