Wednesday, April 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరూ.619.85 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల

రూ.619.85 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల

- Advertisement -

రాష్ట్రంలోని 12,728 గ్రామ పంచాయతీలకు నేరుగా లబ్ది
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు (జీపీ) 15వ ఆర్థిక సంఘం కింద 2025-26 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.619.85 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇందులో టైడ్‌ గ్రాంట్స్‌ కింద రూ.371.91 కోట్లు, యునైటెడ్‌ గ్రాంట్స్‌ కింద రూ.247.94 కోట్లు ఉన్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని 12,728 గ్రామ పంచాయతీలకు నేరుగా లబ్ది చేకూరనుంది. స్థానిక అవసరాలకు అనుగుణంగా గ్రామ సభలు నిర్ణయించిన అభివృద్ధి పనులకు ఈ నిధులు వినియోగించుకోవాల్సి ఉంది. ఎన్నికల జాప్యం కారణంగా నిలిచిపోయిన నిధులను, కొత్త సర్పంచులు బాధ్యతలు స్వీకరించిన తర్వాత దశల వారీగా దాదాపు రూ.1,400 కోట్లను ఇప్పటికే కేంద్రం విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన నిధులతో ఈ మొత్తం రూ.2,000 కోట్లకు చేరింది. రాష్ట్రానికి రావాల్సిన మరో రూ.1,000 కోట్ల నిధులు మే చివరి వరకు విడుదల కానున్నట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -