సీనియర్ ఓటర్ వ్యక్తికి సన్మానం
తాహసిల్దార్ నరేష్
నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు తహసిల్దార్ చందా నరేష్ తెలిపారు. ఆదివారం ఓటర్లలో అవగాహన పెంపొందించేందుకు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించారు. వేడుకలలో భాగంగా రంగోలి పోటీలు నిర్వహించగా, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రతిబింబించే ఆకర్షణీయ రంగోలీలతో కార్యక్రమాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చారు. అలాగే, ప్రజాస్వామ్య వ్యవస్థకు దీర్ఘకాలంగా సేవలందించిన సీనియర్ సిటిజన్లను సత్కరించి గౌరవించారు. తొలిసారిగా ఓటు హక్కు పొందిన నూతన ఓటర్లను సన్మానించి, ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, పోలీస్ సిబ్బంది, కస్తూరిభా పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



