మున్సిపాల్టీల్లో 13 శాతం అద్దె భత్యం మంజూరు చేయాలి : రెండవ వేతన సవరణ సంఘం చైర్మెన్‌కు టీఎస్‌యూటీఎఫ్ వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కొత్త కార్పొరేషన్లలో 17శాతం, మున్సిపాల్టీల్లో 13శాతం ఇంటి అద్దె భత్యం మంజూరు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ. వెంకట్, కోశాధికారి టి. లక్ష్మారెడ్డి కోరారు. ఈమేరకు గురువారం రెండవ వేతన సవరణ సంఘం చైర్మెన్ శివశంకర్, సభ్యులు ఏ.రామయ్యకు వారు వినతిపత్రం అందజేశారు. నూతనంగా అప్‌గ్రేడ్ అయిన మున్సిపల్ కార్పొరేషన్లకు, వాటి శివారు ఎనిమిది కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలకు 17శాతం, నూతన మున్సిపాల్టీలకు, వాటి శివారు ఎనిమిది కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలకు 13 శాతం ఇంటి అద్దె భత్యం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ 1.07.2023 నాటి ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి తమ సిఫారసులుంటాయని పేర్కొన్నారు. నగరాలు, పట్టణాలకు జనాభా ప్రాతిపదికన ప్రభుత్వమే ఇంటి అద్దె భత్యం మంజూరు చేయాలని తమ సిఫారసుల్లో ఉంటుందని తెలిపారు. గత పీఆర్‌సీ జీవో 53 ప్రకారం అర్హత గల నగరాలు, పట్టణాలకు పెంచిన హెచ్‌ఆర్‌ఏ వెంటనే మంజూరు చేయాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శికి సచివాలయంలో వారు వినతిపత్రం అందజేశారు.
కొత్త కార్పొరేషన్లలో 17 శాతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



