Wednesday, December 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనాకా బందీ తనిఖీల్లో 173 వాహనాలు సీజ్‌

నాకా బందీ తనిఖీల్లో 173 వాహనాలు సీజ్‌

- Advertisement -

– కాజీపేటలో మోటార్‌ సైకిల్‌ సైలెన్సర్లు ధ్వంసం
నవతెలంగాణ – వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వ్యాప్తంగా 57 ముఖ్యమైన ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9గంటల పోలీసులు నిర్వహించిన నాకా బందీ తనిఖీల్లో పలు వాహనాలను సీజ్‌ చేసినట్టు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. మంగళవారం వరంగల్‌ కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసులు మొత్తం 8259 వాహనాలను తనిఖీ చేయగా.. ఎలాంటి పత్రాలు లేని 173 వాహనాలను సీజ్‌ చేసినట్టు తెలిపారు. వాటిలో 9 కార్లు, 158 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, ఒక ట్రాక్టర్‌ సీజ్‌ చేయబడ్డాయి. అలాగే ఈ తనిఖీల్లో అక్రమ మద్యం సంబంధించి మొత్తం 7 కేసులు నమోదు చేసి లక్షా 18 వేల రూపాయల మద్యంతో పాటు మూడు లీటర్ల గూడంబా, రూ.1.50లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు ఐదు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు. వీటితో పాటు మడికొండ పోలీసులు భట్టుపల్లి గ్రామంలో తనిఖీల్లో మిస్సింగ్‌ కేసులో కనిపించకుండా పోయిన ఒక వ్యక్తిని పోలీసులు గుర్తించినట్టు తెలిపారు. అలాగే, శబ్ద కాలుష్యాన్ని పెంచుతున్న వాహనాల సైలెన్సర్లను పీకి వేశారు. వాటిని కాజీపేట చౌరస్తాలో ట్రాఫిక్‌ పోలీసులు రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేసినట్టు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -