– సుకుమా ఎస్పీ కిరణ్ చౌహన్
నవతెలంగాణ-చర్ల
ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా ఎస్పీ కిరణ్ చౌహాన్ ఎదుట 18 మంది మావోయిస్టులు మంగళవారం లొంగిపోయారు. సౌత్ బస్తర్ డివిజన్ పీఎల్‌జీఏ నెంబర్ వన్ బెటాలియన్‌తో సంబంధం ఉన్న నలుగురు హార్డ్ కోర్ మావోయిస్టులతో పాటు 18 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులందరికీ రూ.39 లక్షల రివార్డు ప్రకటించారు. లొంగిపోవడానికి జరిగే ప్రక్రియలో జిల్లా రిజర్వు గార్డ్స్, సుక్మా రేంజ్ ఫీల్డ్ టీమ్, కుంట, సుకుమా, జగదల్పూర్, సీఆర్పీఎఫ్ 80, 212, 219, కోబ్రా 203 బెటాలియన్ల నిఘా విభాగాలు ముఖ్యమైన పాత్ర పోషించాయని ఎస్పీ తెలిపారు. మిగిలిన మావోయిస్టులు కూడా హింస మార్గం వీడి, లొంగిపోయి ప్రభుత్వ పునరావాస పథకాలను వినియోగించుకోవాలని కోరారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తరచూ గాలింపు చర్యలు చేపట్టి, భద్రత దళాలు శిబిరాలను ఏర్పాటు చేయడంతో మావోయిస్టులు బలహీనపడి లొంగిపోతున్నారని అన్నారు.
లొంగిపోయిన 18 మంది మావోయిస్టులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES