నవతెలంగాణ – నసురుల్లాబాద్
సేవే పరమావధి నినాదంతో లయన్స్ క్లబ్ సేవలు అందించడంతో బీర్కూర్ లయన్స్ క్లబ్ కు 18 సేవ పురస్కారాలు లభించినట్లు జిల్లా లయన్స్ క్లబ్ జోన్ ఛైర్మన్ కొట్టూరి సంతోష్ కుమార్ తెలిపారు. బీర్కూర్ లో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు కుల, మత, ప్రాంతీయ బేధాలు లేకుండా సమాజానికి సేవ చేయడమే లయన్స్ క్లబ్ ప్రధాన లక్ష్యం అని అన్నారు.
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320డిలోని ‘శ్రీ వేద జనని’ రీజియన్, 4వ సమ్మేళనం సేవా కార్యక్రమాల అవార్డుల కార్యక్రమం నిర్వహించింది. ఇందులో తమ సేవలను గుర్తించి లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ అధినేత బాబురావుకు పురస్కారాలు అందజేసినట్లు సంతోష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు సీతాలే రమేష్, రవీందర్ జెట్టి, గాలయ్య, కందకుర్తి సంతోష్ గుప్తా అశోక్, శ్రీనివాస్, కార్తిక్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.



