Thursday, March 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం19వేల మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ తట్టుకునే నెట్‌వర్క్‌

19వేల మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ తట్టుకునే నెట్‌వర్క్‌

- Advertisement -

– వేసవికాలం ముగిసేవరకు అప్రమత్తంగా ఉండాలి : అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో 19 వేల మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ తట్టుకునేలా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. వేసవికాలం, యాసంగి సీజన్‌ నేపథ్యంలో బుధవారం అసెంబ్లీ ఆవరణలో విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మార్చి 13న విద్యుత్‌ డిమాండ్‌ 18,228 మెగావాట్లకు చేరి, 341.08 మిలియన్‌ యూనిట్ల వినియోగంతో కొత్త రికార్డును సృష్టించిందన్నారు. యాసంగి సీజన్‌తో పాటు వేసవి ప్రభావం కారణంగా రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌, విని యోగం గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు. పెరిగే డిమాండ్‌ కు సరిపడా విద్యుత్‌ను సరఫరా చేయడంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సరఫరాలో అంతరాయం, ఓవర్‌ లోడింగ్‌ సమస్యలు తలెత్తకుండా విద్యుత్‌ సంస్థలు సమర్థంగా వ్యవహరించాలని సూచించారు. విద్యుత్‌ డిమాండ్‌ 19వేల మెగావాట్లకు మించినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం కొత్త సబ్‌స్టేషన్లు, లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గ్రేటర్‌ హైదరా బాద్‌తో పాటు రైతులు, అన్ని రంగాల వినియోగదారులకు నిరంతర విద్యుత్‌ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి నవీన్‌ మిట్టల్‌, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్‌, తెలంగాణ డిస్కం ల సీఎండీలు ముషారఫ్‌ ఫరూఖీ, జితేష్‌ వి.పాటిల్‌, వరుణ్‌ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -