Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్1996-97 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం 

1996-97 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం 

- Advertisement -

నవతెలంగాణ- గోవిందరావుపేట
1996-97 వ సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ 28 సంవత్సరాల క్రితం అనుభవాలను నేడు గుర్తుతెచ్చుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం జరిగిందని అన్నారు. ఆ రోజుల్లో చదివిన చదువులు ఆడిన ఆటలు నెమరు వేసుకోవడం జరిగిందన్నారు. జీవితంలో స్థిరపడిన విధానం చదువు ఉద్యోగం కుటుంబం పరిస్థితులను ఒకరినొకరు ఆప్యాయంగా చెప్పుకోవడం జరిగిందని తెలిపారు. బ్యాచ లో ఎప్పుడూ ఇలగే కలిసి ఉండాలని కష్టసుఖాలను పంచుకోవాలని ఒకరికొకరు అనుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించిన ఏటుకూరి అనితను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సలేంద్ర రాజ్ కుమార్ తాటి పేలా రాజు గుండు శంకర్ బుడిగె రఘువీర్ సామా శ్రీను ముత్తయ్య సారంగపాణి వినయ్ కుమార్ మల్లేష్ సురేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad