– రూ.36వేల కోట్ల నిధుల సమీకరణపై దృష్టి
ముంబయి : ముకేష్ అంబానికి చెందిన రిలయన్స్ జియో ఈ ఏడాదిలో ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రానుందని తెలుస్తోంది. ఈ పబ్లిక్ ఇష్యూలో 2.5 శాతం వాటాను రిలయన్స్ విక్రయించనున్నట్టు రాయిటర్స్ తన రిపోర్ట్‌లో వెల్లడించింది. తద్వారా మార్కెట్ నుంచి సుమారు 4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.36 వేల కోట్లు) సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా నిలిచే అవకాశం ఉంది. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ జెఫ్రీస్ ఇటీవల రిలయన్స్ జియో మార్కెట్ విలువను 180 బిలియన్ డాలర్లుగా అంచనా కట్టింది. రిలయన్స్ జియోను వచ్చే ఐదేండ్లలో పబ్లిక్ ఇష్యూకు తెస్తామని 2019లో ముకేశ్ అంబానీ ప్రకటించారు.
జియో ఐపీఓలో 2.5 శాతం వాటా విక్రయం..!
- Advertisement -
- Advertisement -



