Saturday, December 27, 2025
E-PAPER
Homeఆటలుతొలి రోజే 20 వికెట్లు

తొలి రోజే 20 వికెట్లు

- Advertisement -

యాషెస్‌ బాక్సింగ్‌ డే టెస్టు

మెల్‌బోర్న్‌ : యాషెస్‌ సిరీస్‌ బాక్సింగ్‌ డే టెస్టులో బౌలర్లు విజృంభించారు. ఇటు ఆస్ట్రేలియా, అటు ఇంగ్లాండ్‌ బౌలర్లు నిప్పులు చెరిగే ప్రదర్శనలు చేయటంతో తొలి రోజు ఆటలోనే 20 వికెట్లు కుప్పకూలగా.. రెండు ఇన్నింగ్స్‌లు ముగిశాయి. ఇంగ్లాండ్‌ బౌలర్‌ జోశ్‌ టంగ్‌ (5/45), అటిక్సన్‌ (2/28)లు ఆస్ట్రేలియా బ్యాటర్లను కకావికలం చేశారు. 45.2 ఓవర్లలో 152 పరుగులకు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 29.5 ఓవర్లలోనే ముగిసింది. హ్యారీ బ్రూక్‌ (41, 34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), గస్‌ అటిక్సన్‌ (28) మెరిసినా.. ఇంగ్లాండ్‌ 110 పరుగులకే ఆలౌటైంది. మిచెల్‌ స్టార్క్‌ (2/23), మైకల్‌ నెసర్‌ (4/45), స్కాట్‌ బొలాండ్‌ (3/30) వికెట్లు పడగొట్టారు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 4/0తో ఆడుతోంది. స్కాట్‌ బొలాండ్‌ (4 నాటౌట్‌), ట్రావిశ్‌ హెడ్‌ (0 నాటౌట్‌) అజేయంగా ఆడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -