సరఫరా చేయనున్న ఐకామ్-కారకాల్
హైదరాబాద్ : కేంద్ర సాయుధ బలగాల సంస్థ సీఆర్‌పీఎఫ్‌కు హైదరాబాద్ కేంద్రంగా అధునాతన చిన్న ఆయుధాలను తయారు చేస్తున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్‌నకు చెందిన ఐకామ్ 200 సీఎస్‌ఆర్ 338 స్నైపర్ రైఫిల్స్‌ను సరఫరా చేయనుంది. ఈ ఏడాది చివరి నాటికి సరఫరా పూర్తి కానుంది. ఇందుకోసం సీఆర్‌పీఎఫ్, ఐకామ్-కారకాల్ మధ్య ఒప్పందం జరిగింది. భారత్-యూఏఈ రక్షణ భాగ స్వామ్యంతో భాగంగా కారకాల్‌తో కలిసి ఐకామ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో ఆధునిక చిన్న ఆయుధాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. అక్కడే ఈ రైఫిల్స్ ఉత్పత్తి చేసి సీఆర్‌పీఎఫ్‌కు అందజేయనున్నామని కారకాల్ సీఈఓ హమాద్ అలా మెరి పేర్కొన్నారు భారత భద్రతా అవసరాలకు, పెరుగుతున్న రక్షణ పరిశ్రమకు మద్దతుగా భారత్- యూఏఈ రక్షణ సహకారం ఎంత బలంగా ఉందో దీని ద్వారా స్పష్టమ వుతోందన్నారు. సీఆర్‌పీఎఫ్‌తో ఒప్పందం తమ సంస్థకు ఎంతో గర్వకారణమని ఐకామ్ డైరెక్టర్ సుమంత్ పాతూరు తెలిపారు. భవిష్యత్ అవసరాలు, ఎగుమతి మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడానికి కట్టుబడి ఉన్నామన్నారు.
సీఆర్‌పీఎఫ్‌కు 200 సీఎస్‌ఆర్ -338 రైఫిల్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES