– ట్రంప్ యోచన
వాషింగ్టన్ : విదేశీ ఔషధాలపై 200 శాతం టారిఫ్‌లను విధించే యోచనలో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఎదురైన ఔషధ లోటు సంక్షోభం నేపథ్యంలో దేశీయ ఔషధ ఉత్పత్తిని పెంచాలని భావిస్తున్నామన్నారు. ఇప్పటికే ఆటోమొబైల్స్, స్టీల్ వంటి వస్తువులపై విధించిన టారిఫ్‌లను ఔషధ రంగానికి విస్తరించే పనిలో ఉన్నారని స్పష్టమవుతోంది. చాలా ఔషధాలపై ఎలాంటి సుంకాలు లేకుండా ఇప్పటి వరకు అనుమతిస్తోంది. అయితే ఫార్మాపై సుంకాల పెంపు అమలకు ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. తద్వారా కంపెనీలు స్థానిక తయారీ, ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించడానికి వీలుంటుంది. ఔషధాలపై 200 శాతం సుంకాల అమలు 2026 చివరి నుండి ప్రారంభం కావచ్చని అమెరికా వర్గాలు భావిస్తున్నాయి. ఈ టారిఫ్‌లు అమెరికాలో ఔషధ ధరలను భారీగా పెంచనున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత నిల్వలు 6 నుంచి 18 నెలలు సరిపడ ఉన్నాయని అంచనా. అమెరికా ఈ నూతన టారిఫ్ ప్రతిపాదనలు భారత్, చైనా నుంచి వచ్చే ఔషధాలపై ఎక్కువ ప్రభావం చూపనున్నాయి.
ఔషధాలపై 200 శాతం టారిఫ్‌లు!
- Advertisement -
- Advertisement -