Tuesday, May 6, 2025
Homeకరీంనగర్బాధిత మిత్రుడికి 2009 ఫౌండేషన్ సాయం..

బాధిత మిత్రుడికి 2009 ఫౌండేషన్ సాయం..

- Advertisement -

నవతెలంగాణ – వెల్గటూర్: స్నేహబంధం కాలానుగుణంగా మారదు. కాలాన్ని మించి నిలిచే బంధమని వెల్గటూరులోని జెడ్పీ ఎచ్ హై స్కూల్‌ 2009వ బ్యాచ్ విద్యార్థులు మరోసారి రుజువు చేశారు. అదే తరగతిలో చదువుకున్న ఒక మిత్రుని తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, 9వ రోజు కర్మ కార్యక్రమానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మానవీయతను చాటిచెప్పారు. ఎస్ఎస్సి 2009 ఫౌండేషన్ ద్వారా స్నేహితులు కలిసి రూ.15,900 సేకరించి బాధిత మిత్రునికి అందజేశారు. దీనివల్ల ఆ కుటుంబానికి ఓదార్పుగా నిలిచింది. గమనించాల్సి విషయం ఏంటంటే.. ఈ ఫౌండేషన్‌ ఆవిర్భవించినదీ గత సంవత్సరం. 2023 మే 28న జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో అదే వేదికపై తరగతిలోని విద్యార్థులు ‘ఎస్ఎస్సి 2009 ఫౌండేషన్‌’ను స్థాపించారు. అప్పటి నుండి ఈ సంస్థ బాచ్‌లోని మిత్రులకు ఏ ఆపద వచ్చినా ‘మనలో ఒకరికైతే అందరికీ’ అన్న నినాదంతో ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు పేర్కొంటూ –స్నేహం అంటే కలిసి చదువుకున్న రోజులకే పరిమితం కాదు. జీవితంంతా నిలిచే అనుబంధం. ఆపదలో మిత్రుని వెన్నుగా ఉండగలగడం మాకు గర్వంగా ఉంది అని తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, పాఠశాల ఉపాధ్యాయులు ప్రశంసిస్తూ.. ఈ తరం విద్యార్థులకు మాత్రమే కాదు.. రాబోయే తరం యువతకు ఇది మార్గదర్శకంగా నిలుస్తుంది అని అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -