Thursday, February 26, 2026
E-PAPER
Homeజాతీయం2013 ముజఫర్‌ నగర్‌లో మత ఘర్షణల కేసు..

2013 ముజఫర్‌ నగర్‌లో మత ఘర్షణల కేసు..

- Advertisement -

ఆధారాల్లేవంటూ 37మంది విడుదల
లక్నో : 2013 మత ఘర్షణల్లో ఎనిమిది మంది హత్య కేసులో తగిన ఆధారాలు లేవంటూ 37మంది నిందితులను ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ కోర్టు విడుదల చేసింది. అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి మంజుల భలోటియా మంగళవారం 37మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించారు. ప్రాసిక్యూషన్‌ సహేతుకమైన సందేహాన్ని వెల్లడించింది తప్ప ..అభియోగాలను నిరూపించడంలో విఫలమైందని పేర్కొన్నారు. 2013 సెప్టెంబర్‌ 8న కుట్బా గ్రామంలోని ముస్లింల నివాసాలపై ఓ మూక పదునైన ఆయుధాలతో దాడి చేసిందని, 110 మందిపై ఇమ్రాన్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది నరేంద్ర శర్మ తెలిపారు. ఆ ఘటనలో ఇండ్లకు నిప్పుపెట్టడంతో పాటు ఆస్తులను లూటీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2013లో ముజఫర్‌ నగర్‌లో జరిగిన మత ఘర్షణల్లో 60మందికి పైగా మరణించగా, 40,000మంది నిరాశ్రయులయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -