– 2024 తో పోలిస్తే గణనీయంగా పెరిగిన గెలల ధరలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఏడాదికేడాది కష్టానికి తగిన లాభం దక్కుతుందా? అన్న ఆశతోనే రైతు సాగు చేస్తుంటాడు. కానీ ధరల హెచ్చుతగ్గులు,మద్దతు ధరల లోపం వల్ల రైతు చాలాసార్లు అప్పుల ఊబిలోకి నెట్టబడుతున్నాడు. అయితే 2024తో పోలిస్తే 2025 సంవత్సరం పామాయిల్ రైతులకు లాభదాయకంగా మారింది.
ధరల పెరుగుదల – కీలకాంశాలు
2024 డిసెంబర్: టన్ను గెలల ధర రూ. 20,506
2025 డిసెంబర్: టన్ను గెలల ధర రూ. 19,694
నవంబర్ తో పోలిస్తే డిసెంబర్ లో రూ. 96 స్వల్ప పెరుగుదల
సరాసరి ధర
2024: రూ. 15,557
2025: రూ. 19,513
అంటే ఒక్కో టన్నుకు రూ. 3,956 మేర అదనపు లాభం 2025 లో నమోదైంది.
నెలల వారీగా పామాయిల్ గెలల ధరలు (రూ./టన్ను)
నెల 2024 2025
జనవరి 12,681 20,487
ఫిబ్రవరి 13,135 20,87
మార్చి 14,174 21,000
ఏప్రిల్ 14,229 20,058
మే 13,438 18,748
జూన్ 13,705 17,463
జూలై 13,822 18,052
ఆగస్టు 14,392 19,107
సెప్టెంబర్ 17,043 19,400
అక్టోబర్ 19,144 19,681
నవంబర్ 20,413 19,598
డిసెంబర్ 20,506 19,694
సరాసరి 15,557 19,513
ప్రాంతీయ ప్రాధాన్యం :
రాష్ట్రంలోనే భద్రాద్రి కొత్తగూడెం,ఖమ్మం జిల్లాల్లో అత్యధికంగా సాగయ్యే పంట పామాయిల్. ఈ జిల్లాల్లోని రైతులకు ధరల పెరుగుదల ప్రత్యక్ష లాభంగా మారింది.
2026పై రైతుల ఆశలు :
అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరిగే అవకాశాలున్న నేపథ్యంలో 2026 లో గెలల ధరలు మరింత పెరుగుతాయి ఏమో అన్న ఆశతో రైతులు నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. మొత్తంగా 2025 సంవత్సరం పామాయిల్ రైతులకు ఊరటనిచ్చిన ఏడాదిగా నిలిచింది. ధరలు స్థిరంగా పెరిగితే,పంటపై రైతుల నమ్మకం మరింత బలపడనుంది.



