నవతెలంగాణ – భీంగల్
భీంగల్ పట్టణంలోని విజయ హై స్కూల్ పాఠశాలలో అడ్విటెక్ రోబోటిక్స్ వారు,శనివారం రోజున టెక్ ఎక్స్పో రోబోక్వెస్ట్ 2025 కార్యక్రమం నిర్వహించారు. రోబోటిక్స్ అనేది యాంత్రిక ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ల సమ్మిళిత రూపం. ఇది మానవుల పనిని సులభతరం చేయడమే కాకుండా, సమాజం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది అని ఈ సంస్థ మేనజింగ్ డైరెక్టర్ మారుతీ గారు తెలిపారు.
అలాగే భీంగల్ వీడీసీ అధ్యక్షులు నీలం రవి మాట్లాడుతూ సమయం, శ్రమ ఆదా అవుతుంది,ఖచ్చితత్వం, నాణ్యత పెరుగుతుంది,ప్రమాదకర పనులను రోబోట్లు చేసి, మానవ ప్రాణాలను రక్షిస్తాయి,ఆర్థిక అభివృద్ధికి ఇది ఒక కీలక శక్తి అని తెలిపారు.పాఠశాల ప్రధానఉపాధ్యులు చంద్రశేఖర్ సంతపురి మాట్లాడుతూ పరిశ్రమలలో,వైద్య రంగంలో,వ్యవసాయ రంగంలో,విద్య & పరిశోధన,రక్షణ, భద్రత,అంతరిక్ష పరిశోధన,దైనందిన జీవితం లో చాలా ఉపయోగ పడుతుంది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో అడ్విటెక్ రోబోటిక్స్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ రామావత్, రాకేష్, ఉపాధ్యాయులు బృందం పాల్గొన్నారు.
భీంగల్ విజయ హైస్కూల్లో 2025 రోబోటిక్ టెక్ ఎక్స్పో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES