Sunday, March 1, 2026
E-PAPER
Homeక్రైమ్ఏపీలో బాణాసంచా పేలి 21 మంది మృతి

ఏపీలో బాణాసంచా పేలి 21 మంది మృతి

- Advertisement -

13 మందికి తీవ్ర గాయాలు..వీరిలో 9 మంది పరిస్థితి విషమం
టాపాసులు తయారు చేస్తుండగా ప్రమాదం
పరారీలో యజమాని
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఘటన
ఘటనపై ఆరా తీసిన సీఎం చంద్రబాబు

సామర్లకోట : ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన తర్వాత బాణాసంచా యజమాని అక్కడి నుంచి పరార య్యాడు. ప్రమాద విషయం తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘటనపై ఆరా తీశారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ పేలుడుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. సామర్లకోట మండలంలోని వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్‌ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌ కేంద్రంలో బాణాసంచా తయారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అందులో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 13మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 9మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్టు సమాచారం. ఘటనాస్థలికి స్థానికులు చేరుకునేటప్పటికే పలువురి శరీరభాగాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. కొన్ని మతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది.

భారీ విస్ఫోటం
బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించడంతో ఆ శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించినట్టు స్థానికులు తెలిపారు. శబ్దం తీవ్రతకు పక్క గ్రామంలో ఉన్న ప్రయివేటు పాఠశాలలో శ్లాబ్‌కు పగుళ్లు వచ్చాయి. ఐదు గ్రామాల పరిధిలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది రెండు ఫైర్‌ ఇంజిన్ల సాయంతో ఘటనాస్థలంలో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ మొత్తం 34 మంది పనిచేస్తున్నారు. పేలుడుకు ముందు కొందరు కార్మికులు భోజనానికి బయటకు వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ బాణాసంచా పరిశ్రమను అడపా నాని కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పరిమితికి మించి బాణాసంచా తయారు చేయడం వల్లే ఘటన జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.

ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
బాణాసంచా పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్షతగా త్రుల్లో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్‌ చేస్తున్నట్టు తెలిపారు. విచారణ పూర్తయ్యాక బాధ్యులపై చర్యలు తీసుకుం టామన్నారు. మతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

మతులు వీళ్లే..
మతుల్లో ఇప్పటి వరకు 11 మందిని పోలీసులు గుర్తించారు. అడబాల శ్రీను, కడింపల్లి కపమ్మ, కడింపల్లి ధనరాజు, సాధనాల సత్యవేణి, వట్లూరి రవి, మందపల్లి చిన్ని, నిమ్మద కరుణ, గంపల మంగ, గొడతా మహేశ్‌, గొడతా రాము, గొడతా నానిగా పోలీసులు పేర్కొన్నారు. మరికొన్ని మతదేహాలను గుర్తించాల్సి ఉంది.

పరారీలో బాణాసంచా యజమాని
వేట్లపాలెంలో బాణసంచా పేలుడు ఘటనపై ఆర్‌డీవో మల్లిబాబు స్పందించారు. ఈ పరిశ్రమకు ఈ ఏడాది మార్చి 31 వరకు లైసెన్స్‌ ఉందని, పేలుడు ఘటన తర్వాత యజమాని పరారీలో ఉన్నాడని ఆయన మీడియాకు వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -