Saturday, January 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకొండచరియలు విరిగిపడి 21 మంది మృతి

కొండచరియలు విరిగిపడి 21 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఆఫ్రికా దేశం కెన్యాలో విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి 21 మంది మృతి చెందారు. 30 మందికి పైగా గల్లంతవగా వారికి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దక్షిణ కెన్యా ప్రాంతంలోని మారాక్‌వెట్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో కొండచరియలు విరిగిపడ్డాయని దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. కెన్యాలో ప్రస్తుతం వర్షాకాలం కావడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -