– కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘటన
నవతెలంగాణ-బిచ్కుంద
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం షెట్లూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు వాంతులు చేసుకొని అస్వస్థతకు గురయ్యారు. ఈ పాఠశాలలో మొత్తం విద్యార్థులు 44 విద్యను అభ్యసిస్తుండగా సోమవారం 28 విద్యార్థులు హాజరయ్యారు. రోజు వారీగా మధ్యాహ్న భోజనంలో అన్నం, మిల్ మేకర్, ఉడికిన గుడ్డు నిర్వాహకులు వడ్డించారు. వండిన మధ్యాహ్న భోజనంలో ఉడికీఉడకని వంట చేయడం ..ఉప్పు ఎక్కువ వేయడం గమనించిన ఉపాధ్యాయు రాలు స్వప్న మధ్యాహ్న భోజన నిర్వాహకులపై రిపోర్ట్ రాసి మండల విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. భోజనం చేసిన తర్వాత 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై వాంతులు చేసుకో వడంతో ఉపాధ్యాయురాలు మండల విద్యాధికారికి సమా చారం అందించారు. వెంటనే విద్యార్థులను అంబు లెన్స్‌లో బిచ్కుందలోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, మధ్యాహ్న భోజనం సరిగా వండటం లేదంటూ గతంలో కూడా అధికారులకు ఫిర్యాదు చేశామని, మధ్యాహ్న భోజన నిర్వహకులను వెంటనే తొలగించా లని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
భోజనంలో పురుగులున్నాయంటూ విద్యార్థుల ఫిర్యాదు
మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురైన విద్యార్థులను పరిశీలించడానికి వచ్చిన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి విద్యార్థులతో మాట్లాడారు. అన్నంలో పురుగులు ఉన్నాయని, కూర ల్లో ఉప్పు ఎక్కువ వేసి వండటం వల్ల సగం ఉడికిన అన్నం తిన్నామని, భోజనం తిన్న కొద్ది సేపటికే వాంతులు అయ్యాయని విద్యార్థులు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే మధ్యాహ్న భోజన నిర్వాహకులను తొలగించాలని పురుగులున్న బియ్యా న్ని పరిశీలించి వాటి స్థానంలో వేరే బియ్యం సరఫరా చేయాలని మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు.
మిషన్ భగీరథ ద్వారా కలుషిత తాగు నీరు సరఫరా అవుతున్నాయని, ఆ నీరు తాగడం వల్ల విద్యార్థులతో పాటు ప్రజలు అస్వస్థత కు గురవు తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటికి రోజువారి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఇబ్బం దులు కలగకుండా వాంతులు పూర్తిగా తగ్గే వరకు చికిత్సలు నిర్వహించాలని వైద్య సిబ్బందిని ఆదేశిం చారు. ఆమె వెంట జిల్లా విద్యాధికారి రాజు, తహసీ ల్దార్ వేణుగోపాల్, ఎంపీడీఓ గోపాలకృష్ణ, ఎస్‌ఐ మోహన్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ భారత్ ఉన్నారు.
విద్యార్థులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే..
మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన చికిత్సలు అందించాలని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆయన వెంట నాయకులు డాక్టర్ రాజు, బొమ్మల లక్ష్మణ్, నల్చర్ రాజు, బసవరాజ్ పటేల్ ఉన్నారు.
మధ్యాహ్న భోజనం వికటించి..21 మంది విద్యార్థులకు అస్వస్థత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES