నిమ్స్‌లో 4వ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ శిబిరం విజయవంతం
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించిన 4వ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ శిబిరం విజయవంతంగా పూర్తయింది. ఈ శిబిరాన్ని నిమ్స్ కార్డియోథోరాసిక్ అండ్ వాస్క్యులర్ సర్జరీ విభాగం, డాక్టర్ రమణ బ్రిటీష్ వైద్య బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రసిద్ధ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమణ, నిమ్స్ విభాగాధిపతి డాక్టర్ ఎం.అమరేశ్‌రావు నాయకత్వంలో ప్రత్యేక వైద్యులు సేవలందించారు. 22 మంది చిన్నారులకు క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. పుట్టినప్పటి నుంచే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ఈ చికిత్స అందించారు. బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) మిస్టర్ గారెత్ విన్ ఓవెన్, సీనియర్ ట్రేడ్ అడ్వైజర్ మిస్ సిమ్రన్ మసాండ్ నిమ్స్‌ను సందర్శించారు. బ్రిగేడియర్ డాక్టర్ నిఖిల్ తివారి, డాక్టర్ రమణ శిష్యుడు, 92 బేస్ ఆస్పత్రి (శ్రీనగర్) డైరెక్టర్, హాస్పిటల్ ”టెంపుల్”గా గుర్తింపు పొందిన సందర్భాన్ని వివరించారు. రష్యా నుంచి పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ నాటాలియా నిచే, అడ్వాల్యు హెడ్ డాక్టర్ నికోస్ బృందం నిమ్స్‌లో సేవలందించింది. 500మందికి పైగా రోగులు యూకే బృందం సేవలు పొందగా, శస్త్రచికిత్స అవసరమున్న పిల్లలు.. తర్వాత నిమ్స్‌లో నమోద య్యారు. ఈ శిబిరానికి హైదరాబాద్‌లోని అనేక ప్రయివేటు సంస్థల నుంచి జూనియర్ పీడియాట్రిక్ కార్డియాలజిస్టులు, సర్జన్లు హాజరయ్యారు. నిమ్స్‌లో మొదటిసారి ఆరోగ్యశ్రీ కింద ఈ శస్త్ర చికిత్సలను చేశారు. యూకే నిపుణులు పేషెంట్ బెడ్‌సైడ్‌లో మార్గదర్శకత్వం ఇచ్చారు. డాక్టర్ రమణ నిమ్స్ సౌకర్యాలు, మౌలిక వసతులు, సిబ్బంది నైపుణ్యంపై ప్రశంసలు అందించారు. గత శిబిరం రోగులు తమ ఆరోగ్య పురోగతిని పంచుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులందరికీ ఉచిత సేవలందించారు.
22 మంది చిన్నారులకు క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES