- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కేంద్రంలో 22 మంది మావోయిస్టులు ఎస్పీ కిరణ్ చౌహాన్ ఎదుట లొంగిపోయారు. వీరంతా మిలీషియా కమాండర్ గోంచే హుంగా ఆధ్వర్యంలో పనిచేస్తున్నారని ఎస్పీ తెలిపారు. సీఆర్పీఎఫ్ క్యాంపులు, కూంబింగ్ ఆపరేషన్లు, ప్రధాన నాయకుల లొంగుబాటుతో గ్రామస్థాయిలో పనిచేసే సానుభూతిపరులు, మిలీషియా సభ్యులు జనజీవనంలోకి వస్తున్నారని, వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని ఆయన వెల్లడించారు.
- Advertisement -



