Saturday, November 15, 2025
E-PAPER
Homeబీజినెస్వంట నూనెల దిగుమతుల్లో 22 శాతం పెరుగుదల

వంట నూనెల దిగుమతుల్లో 22 శాతం పెరుగుదల

- Advertisement -

న్యూఢిల్లీ : ఈ ఏడాది అక్టోబర్‌తో ముగిసిన మార్కెటింగ్‌ ఏడాది (2024-25)లో రూ.1.61 లక్షల కోట్ల విలువ చేసే 16 మిలియన్‌ టన్నుల వంట నూనెలను భారత్‌ దిగుమతి చేసుకుందని సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఈఏ) వెల్లడించింది. 2023-24లో రూ.1.32 లక్షల కోట్ల విలువ చేసే 15.96 మిలియన్‌ టన్నుల దిగుమతులు జరిగాయని.. దీంతో పోల్చితే విలువ పరంగా 22 శాతం పెరుగు దల చోటు చేసుకుందని పర్కొంది. అత్యధికంగా ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్‌, అర్జెంటినా, బ్రెజిల్‌ నుంచి సోయా బిన్‌ ఆయిల్‌ ఎక్కువ వచ్చిందని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -