తహసిల్దార్ శ్రావణ్ కుమార్ స్పష్ఠీకరణ..
నవతెలంగాణ – రెంజల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి సర్వేలో 224 మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారని, తహసిల్దార్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. ఈనెల 3 నుంచి 16 వరకు మండలంలోని 10 గ్రామ పంచాయతీల పరిధిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పలువురు రైతులు తమ భూ సమస్యలపై దరఖాస్తులు చేసుకున్నారని, వాటిలో కొన్ని పరిష్కరించి మరికొన్ని ఉన్నతాధికారులకు నివేదికను అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా వచ్చిన దరఖాస్తులలో సర్వేనెంబర్ మిస్సింగ్, జిల్లా కలెక్టర్ వద్ద పెండింగ్ లో ఉన్న సమస్యలు, భూములు తక్కువ ఎక్కువగా ఉన్నవాటిపై దరఖాస్తులు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. సాదా బైనామా, మోకా సర్వే తదితర సమస్యలపై దరఖాస్తులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. గ్రామాల వారీగా సాటాపూర్ 4, నీలా 41, బోర్గాం 8, కందకుర్తి 14, తాడు బిలోలి 24, బాగేపల్లి 6, కోనపల్లి7, కళ్యాపూర్ 13, రెంజల్ 52, దూపల్లి 55, దరఖాస్తులు రాగా, వాటిలో కొన్నింటిని సత్వరంగా పరిష్కారం చేయడం జరిగిందని, మిగతా భూ సమస్యలను ఉన్నతాధికారులకు నివేదిక పంపించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈనెల 20 వరకు మిగతా అందుబాటులో లేని రైతులు సైతం తాసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సర్వేలో ఎంఆర్ఐ రవికుమార్, ఏ ఆర్ ఐ రాజు, జూనియర్ అసిస్టెంట్లులు మన్సూర్, గౌతమ్, సంజీవ్, శంకర్, భూభారతి ఆపరేటర్ రజిని, కంప్యూటర్ ఆన్లైన్ ఆపరేటర్ అభిషేక్, అరుణ్ , రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
భూభారతికి 224 దరఖాస్తులు..
- Advertisement -
- Advertisement -