Sunday, April 5, 2026
E-PAPER
Homeబీజినెస్టఫే ట్రాక్టర్ల అమ్మకాల్లో 23 శాతం వృద్ధి

టఫే ట్రాక్టర్ల అమ్మకాల్లో 23 శాతం వృద్ధి

- Advertisement -

హైదరాబాద్‌: ప్రముఖ ట్రాక్టర్ల తయారీ సంస్థ టఫే గడిచిన ఆర్థిక సంవత్సరం (2025-26) అమ్మకాల్లో నూతన రికార్డ్‌ను సృష్టించినట్లు తెలిపింది. మొత్తం విక్రయాలు 23 శాతం పెరిగి 2,14,951 యూనిట్లకు చేరాయని ఆ సంస్థ వెల్లడించింది. గతేడాది ఈ విక్రయాలు 1,74,785 యూనిట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా మార్చి 2026లో ఏకంగా 37.4 శాతం వృద్ధిని సాధించామని ఆ కంపెనీ వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ లక్ష్మీ వేణు పేర్కొన్నారు. కంపెనీకి చెందిన మ్యాస్సే ఫెర్గూసన్‌, ‘ఐషర్‌’ బ్రాండ్లు రెండూ దేశీయ మార్కెట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాయన్నారు. ఈ ఏడాది రైతులకు, ట్రాక్టర్‌ మార్కెట్‌కు ఎంతో సానుకూలంగా ఉందని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -