- Advertisement -
హైదరాబాద్ : జాతీయ సీనియర్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు తెలంగాణ ఫెన్సింగ్ సంఘం నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్‌లో 24 మంది క్రీడాకారులు అర్హత సాధించారు. శామీర్‌పేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌లో నిర్వహించిన ఈ సెలెక్షన్ ట్రయల్స్‌లో మొత్తం 71 మంది ఫెన్సర్లు పాల్గొన్నారు. ఫాయిల్‌లో మణికంఠ, ఇలియాజుద్దీన, సాయి నిఖిల్, తనీష్క్ జాదవ్, ఫౌజియా, శివానీ, రోషిణి, నిఖిత, ఈపీలో సంజరు, ప్రణవ్, వర్షిత, వంశీ, త్రివేణి, నజియా, చరిత, పూజ, సబ్రేలో గంగా నాయక్, హరిషాన, గౌరవ్, పార్థసారథి, శ్రీచరణి, శరణ్య శిరీషా, అనన్య ఈనెల 15 నుంచి ఢిల్లీలో జరిగే జాతీయ పోటీల్లో తెలంగాణకు ప్రాతినిథ్యం వహించనున్నారు.
- Advertisement -



